గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రమే ‘అఖండ 2 తాండవం’. క్రేజీ హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో కాలం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమాకి బాలయ్య కెరీర్ లోనే భారీ టార్గెట్ తో ఈ సినిమా రాబోతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. మెయిన్ గా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా భారీ మొత్తంలో టార్గెట్ ని పెట్టుకున్నట్టు టాక్.
మరి ఈ బజ్ ప్రకారం తెలుగు స్టేట్స్ లో 200 కోట్ల గ్రాస్ టార్గెట్ తో వస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అఖండ 2 తో బాలయ్య ముందు తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ టార్గెట్ ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం హైప్ బాగానే ఉంది. పైగా ఈ సినిమా ప్రీమియర్స్ తో కూడా రానున్నట్టు వినిపిస్తుంది. అలాగే 3డి వెర్షన్ లో కూడా వస్తుండడంతో ఆ వసూళ్లు కూడా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మొత్తానికి అయితే ఒక యూనానిమస్ టాక్ గత సినిమాలా దీనికి కూడా రావాల్సి ఉంది.


