సమీక్ష: 12ఏ రైల్వే కాలనీ – రెగ్యులర్ క్రైమ్ యాక్షన్ డ్రామా!

సమీక్ష: 12ఏ రైల్వే కాలనీ – రెగ్యులర్ క్రైమ్ యాక్షన్ డ్రామా!

Published on Nov 21, 2025 4:01 PM IST

12A-Railway-Colony

విడుదల తేదీ : నవంబర్ 21, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : ‘అల్లరి’ నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల, సాయి కుమార్, ‘వైవా’ హర్ష, ‘గెటప్’ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణి ఇతర ప్రధాన తారాగణం.
దర్శకుడు : డాక్టర్ అనిల్ విశ్వనాథ్
నిర్మాత : శ్రీనివాస చిట్టూరి
సంగీత దర్శకుడు : భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రాఫర్ : కుశేందర్ రమేష్ రెడ్డి
ఎడిటర్ : దర్శకత్వం: నాని కాసరగడ్డ

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

‘అల్లరి’ నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల హీరో హీరోయిన్లుగా రూపొందిన సినిమా ’12ఏ రైల్వే కాలనీ’. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

కార్తీక్ (‘అల్లరి’ నరేష్) అనాధ. లోకల్ రాజకీయ నాయకుడు టిల్లు అన్న (జీవన్ కుమార్) చెప్పింది చేస్తుంటాడు. మరోవైపు తన ఇంటి పక్కన ఉండే ఆరాధన (డాక్టర్ కామాక్షి భాస్కర్ల) కి లైన్ వేస్తుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల అనంతరం.. ఆరాధనతో తాను ప్రేమలో ఉన్నాను అని కార్తీక్ కి అర్ధం అవుతుంది. ఐతే, ఆ తర్వాత టిల్లు అన్న చెప్పిన ఓ పని కారణంగా కార్తీక్, ఆరాధన ఇంట్లోకి దొంగచాటుగా వెళ్తాడు. ఆ ఇంట్లో కార్తీక్ ఏం చూసి షాక్ అయ్యాడు ?, ఆరాధన ఇంట్లో జరిగిన సంఘటనలు ఏమిటి ?, ఇంతకీ, ఆరాధనతో ఆమె తల్లి హత్యకు కారణం ఎవరు ?, మొత్తానికి ఈ మర్డర్స్ మిస్టరీకి కార్తీక్ కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ?, చివరకు కార్తీక్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ ’12 ఏ రైల్వే కాలనీ’ సినిమాలో అక్కడక్కడా ఫన్ ఎలిమెంట్స్ తో పాటు థ్రిల్ చేసే ఇంటర్వెల్ అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ హారర్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. ప్రేమ కథగా మొదలై.. అనుకోకుండా మర్డర్ మిస్టరీ చుట్టూ కథనం మారుతుంది. మధ్యలో హారర్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అల్లరి నరేష్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించడం బాగుంది. ఇక హత్యలను హీరో అనుకోకుండా చూడటం ?, ఇంతకీ ఆ హత్యలను ఎవరు చేశారు? అనే పాయింట్ చుట్టూ కథను మలుపు తిప్పడం బాగుంది.

అదే విధంగా హత్యల విచారణలో వచ్చే కొన్ని ఇన్వెస్టిగేటివ్ సన్నివేశాలు కూడా బాగున్నాయి. ఇక హీరోగా అల్లరి నరేష్ చక్కని నటనను కనబరిచాడు. కొన్ని కీలక సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకు అల్లరి నరేష్ పూర్తి న్యాయం చేశాడు. అలాగే, ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన సాయి కుమార్ చాలా బాగా నటించాడు. హీరోయిన్ గా నటించిన డాక్టర్ కామాక్షి భాస్కర్ల కూడా చాలా బాగా నటించింది.

అలాగే సాయి కుమార్, ‘వైవా’ హర్ష, ‘గెటప్’ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణిలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. అన్నట్టు క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమాను దర్శక రచయితలు మలిచిన విధానం బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ ’12ఏ రైల్వే కాలనీ’ సినిమాలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా ఉన్నా.. కొన్ని చోట్ల ప్లే మాత్రం చాలా సింపుల్ గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ బోర్ గా సాగాయి. ఫస్ట్ హాఫ్ ను ఇంకా బలంగా రాసుకుని ఉండాల్సింది. దీనికితోడు, సినిమాలో అనవసరమైన ల్యాగ్ సీన్స్ కూడా ఎక్కువైపోయాయి. పైగా ఈ సినిమా స్లో నేరేషన్ తో పాటు బోరింగ్ ట్రీట్మెంట్ అండ్ ఫేక్ ఎమోషన్స్ తో ప్లే సాగుతుంది.

అలాగే కొన్ని లవ్ సీన్స్ కూడా సరిగ్గా కనెక్ట్ అవ్వవు. అదే విధంగా రచయిత డాక్టర్ అనిల్ విశ్వనాథ్ రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని క్రైమ్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. కథ కథనాలను కూడా ఇంకా బెటర్ గా రాసుకుని ఉండి ఉంటే బాగుండేది. ముఖ్యంగా హత్యలు ఎవరు చేశారనే ఉత్కంఠను ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. మొత్తానికి సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నా.. మధ్యలో కొన్ని అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశారు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. రచయిత డాక్టర్ అనిల్ విశ్వనాథ్, దర్శకుడు నాని కాసరగడ్డ ఈ క్రైమ్ థ్రిల్లర్ కి గుడ్ ట్రీట్మెంట్ ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. ప్లే ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. మూవీ ఓపెనింగ్ దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా నేచురల్ గా చూపించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగానే ఉంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాత శ్రీనివాస చిట్టూరి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

తీర్పు :

’12ఏ రైల్వే కాలనీ’ అంటూ వచ్చిన ఈ మర్డర్స్ మిస్టరీ.. కొన్ని చోట్ల ఆకట్టుకుంది. ఐతే, కొన్ని క్రైమ్ సీన్స్ అండ్ మెయిన్ సీక్వెన్స్ లు బాగున్నప్పటికీ.. స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ సీన్స్ లేకపోవడం, కొన్ని కీలక సన్నివేశాల్లో ఇంట్రెస్ట్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. మొత్తమ్మీద ఈ లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌ లో ఇంటర్వెల్ అండ్ కొన్ని క్రైమ్ ఎలిమెంట్స్ మాత్రమే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు