‘కాంత’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనా..?

‘కాంత’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనా..?

Published on Nov 20, 2025 1:00 AM IST

Kaantha Movie Review

పీరియాడిక్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ‘కాంత’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర ప్రదర్శితమవుతోంది. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బొర్సె, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో రానా దగ్గుబాటి మరో కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాకు తొలిరోజు మంచి రెస్పాన్స్ దక్కినా, మౌత్ టాక్ కారణంగా పెద్ద వసూళ్లు రాలేదు. ఆ తర్వాత ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు.

దీంతో ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో కాంత చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. దీంతో ఈ సినిమాను డిసెంబర్ 12న ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయట.

ఇక ఈ సినిమాను రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ప్రొడ్యూస్ చేయగా సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేశారు. మరి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు లాక్ అవుతుందో చూడాలి.

తాజా వార్తలు