క్రేజీ బజ్: ‘వారణాసి’ హనుమాన్ ఎవరో కాదు!?

క్రేజీ బజ్: ‘వారణాసి’ హనుమాన్ ఎవరో కాదు!?

Published on Nov 20, 2025 12:00 AM IST

Varanasi

ప్రస్తుతం ప్రపంచమే ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రమే “వారణాసి”. సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ చిత్రమే “వారణాసి”. అనౌన్సమెంట్ తోనే భారీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా అనౌన్సమెంట్ వీడియోతో క్రేజీ హైప్ అందుకుంది. అయితే ఇందులో రామాయణ విజువల్స్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.

మరి ఇందులో హనుమాన్ విజువల్ కూడా మంచి ఎపిక్ గా కనిపించింది. అయితే ఆల్రెడీ మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారని కన్ఫర్మ్ అయ్యింది. కానీ హనుమాన్ గా ఎవరు కనిపిస్తారు అనేది క్రేజీ బజ్ ఇపుడు వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ సినిమాలో ప్రముఖ నటుడు మాధవన్ ఈ సినిమాలో హనుమాన్ గా కనిపిస్తారని తెలుస్తుంది. దీనితో ఈ టాక్ మంచి ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ బయటకి రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు