జూన్ 21న ‘అనార్కలి’

జూన్ 21న ‘అనార్కలి’

Published on Jun 19, 2013 5:26 PM IST

Anarkali

ఓంకార్ హీరోగా గౌరీ శర్మ హీరోయిన్ గా నటించిన సినిమా ‘అనార్కలి’. ఈ సినిమా జూన్ 21న విడుదల కానుంది. ఈ సినిమాతో ఓంకార్ హీరో గా పరిచయమవుతున్నాడు. అందమైన ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకి పీఎన్ రాయ్ దర్శకత్వం వహించాడు. కె. విద్యాప్రతాప్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాని గౌతమి ఎంటర్టైన్మెంట్ పతాకంపై సక్కుబాయ్ నిర్మించారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ప్రేమను సంపాదించడానికి చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ. ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు, ఎమ్మెస్ నారాయణ, ప్రభ మొదలగువారు నటించారు.

తాజా వార్తలు