టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేతులు కలిపి ఓ వినూత్న ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఆశ్చర్యకరంగా, ఈ కాంబినేషన్ ఒక హారర్ చిత్రాన్ని తీసుకు రాబోతోంది. ఈ సినిమా నేడు పూజా కార్యక్రమంతో మొదలైంది.
నవీన్ యేర్నేని, రవి శంకర్ నిర్మించబోయే ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ ప్రజెంట్ చేస్తున్నారు. టైటిల్ ఇంకా ఫిక్స్ కాకపోయిన ఈ చిత్రంలో సూర్యరాజ్, హను రెడ్డి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రీతి పగడాల ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ప్రశాంత్ నీల్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కీర్తన్ నడగౌడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమాటోగ్రఫీని దినేష్ దివాకరన్ అందించనున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.


