మాస్ రాజాతో స్టార్ బ్యూటీ.. సెట్ అయ్యేనా..?

మాస్ రాజాతో స్టార్ బ్యూటీ.. సెట్ అయ్యేనా..?

Published on Nov 17, 2025 11:00 PM IST

మాస్ రాజా రవితేజ ఇటీవల మాస్ జాతర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు ఆయన తన నెక్స్ట్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ని రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు.

అయితే, త్వరలో రవితేజ ఓ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించబోయే సినిమా సినిమాలో రవితేజ నటించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంత ఆయనకు జోడీగా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సమంత ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. మరి నిజంగానే రవితేజ-సమంత కాంబినేషన్ సెట్ అవుతుందా..? అనేది ఆసక్తికరంగా మారింది.

తాజా వార్తలు