యావత్ టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ మరికొద్ది గంటల్లో అంగరంగ వైభవంగా జరగనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో 29వ చిత్రంగా రాబోతున్న ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని ఎస్ఎస్.రాజమౌళి అత్యద్భుతంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్ కోసం ఏర్పాట్లు గ్రాండ్‌గా చేస్తున్నారు మేకర్స్.
ఇక ఈ ఈవెంట్‌ను ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా జక్కన్న అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షోకు హోస్ట్‌లుగా తెలుగులో సుమ, హిందీలో ప్రముఖ యూట్యూబర్ ఆశీష్ వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. దీని కోసం వారు ఎలాంటి ప్రిపరేషన్ చేస్తున్నారనే విషయంపై యాంకర్ సుమ ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘లెట్స్ బిగిన్ ది షో’ అంటూ ఆమె ఆ ఫోటోకు ట్యాగ్ చేశారు.
దీంతో ఈవెంట్ నిర్వహణలో జక్కన్న ఎంత లీనమయ్యారో మనకు ఈ ఫోటో చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే పాత్రలో నటిస్తుండగా ప్రియాంక చోప్రా ‘మందాకిని’ అనే పాత్రలో నటిస్తోంది.


