ఈ దీపావళి కానుకగా రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ హిట్ చిత్రాల్లో కోలీవుడ్ నుంచి వచ్చిన చిత్రం డ్యూడ్ కూడా ఒకటి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నేహా శెట్టి, మమిత బైజు హీరోయిన్స్ గా దర్శకుడు కీర్తిశ్వరన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రదీప్ కి హ్యాట్రిక్ 100 కోట్ల సినిమాగా నిలిచింది. తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా మంచి సక్సెస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఈ సినిమా ఓటిటి హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో రేపటి నుంచి ఈ సినిమా రానుంది.
అయితే ఓటిటి ఆడియెన్స్ ని ఈ సినిమా మెప్పిస్తుందా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మొత్తానికి సినిమాకి రెస్పాన్స్ ఎలా ఉన్నా అందులోని కోర్ పాయింట్ కి మాత్రం చూసిన ఆడియెన్స్ లో కంప్లీట్ గా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు. ఇపుడు ఓటిటికి వచ్చాక ఈ సినిమా విషయంలో రెస్పాన్స్ మరింత భిన్నంగా ఉండే అవకాశం కూడా ఉంది. సో ఈ సినిమా ఓటిటిలోకి వచ్చిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి మరి.


