35 గంటల్లో ‘పెద్ది’ సాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్!

35 గంటల్లో ‘పెద్ది’ సాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్!

Published on Nov 9, 2025 3:59 PM IST

Peddi's Chikiri Chikiri Song
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి మేకర్స్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ని రీసెంట్ గానే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

చికిరి చికిరి అంటూ సాగే ఈ సాంగ్ పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అయ్యింది. భారీ వ్యూస్ ని ఒక్క రోజులోనే సాధించిన ఈ సాంగ్ ఇపుడు 35 గంటల్లో ఏకంగా 53 మిలియన్ వ్యూస్ ని అన్ని భాషల్లో అత్యంత వేగంగా అందుకొని అదరగొట్టింది. అంతే కాకుండా 1.1 మిలియన్ కి పైగా లైక్స్ ని కూడా ఈ సినిమా సాంగ్ సొంతం చేసుకోవడం విశేషం.

మరి మొదటి పాటకే ఇలా ఉంటే ఇక నెక్స్ట్ రానున్న పాటలు సినిమాకి రెహమాన్ స్కోర్ ఏ లెవెల్లో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు