దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటేనే.. వివాదానికి కేంద్ర బిందువు. తన గురించి ఎవరు ఏమనుకుంటారో ?, తన పోస్ట్ ల పై ఎదుటి వ్యక్తులు ఎలా ఫీల్ అవుతారో ? లాంటి వాటి గురించి వర్మ అస్సలు ఆలోచించడు. వర్మ అంటేనే కాంట్రవర్సీ. అయితే, అలాంటి వర్మ ప్రస్తుతం క్షమాపణలు కోరడం విశేషం. తన తొలి సినిమా ‘శివ’ రీ రిలీజ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవికి థాంక్స్ చెప్పడంతోపాటు క్షమాపణలు కూడా చెప్పాడు.
ఇంతకీ, రామ్‌గోపాల్ వర్మ ఏం పోస్ట్ పెట్టాడు అంటే.. ‘థాంక్స్ చిరంజీవి గారు. అనుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే ఈ సందర్భంగా క్షమాపణలు కోరుతున్నాను. మీ విశాల హృదయంతో మా టీమ్‌ని విష్ చేసింనందుకు మరోసారి నా తరుపున కృతజ్ఞతలు’’ అంటూ వర్మ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు. గతంలో వర్మ, చిరంజీవి హీరోగా ‘వినాలని ఉంది’ అనే సినిమా తెరకెక్కించాలనుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.


