సూపర్ స్టార్ మనవడితో అజయ్ భూపతి సినిమా !

సూపర్ స్టార్ మనవడితో అజయ్ భూపతి సినిమా !

Published on Nov 9, 2025 12:02 PM IST

‘ఆర్ఎక్స్ 100’, మంగళవారం చిత్రాలతో ప్రేక్షకులను ఆకర్షించిన దర్శకుడు అజయ్ భూపతి తన తదుపరి ప్రాజెక్ట్ కు రెడీ అయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటి నుంచి ఓ కొత్త హీరోని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడు. లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణతో అజయ్ భూపతి సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అప్ డేట్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

అన్నట్టు ఈ సినిమాలో సీనియర్ కథానాయిక రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్ గా నటిస్తోందని తెలుస్తోంది. ఆమె కూడా ఈ సినిమాతోనే తెలుగులోకి అరంగేట్రం చేయబోతుంది. ఈ చిత్రం తీవ్రమైన భావోద్వేగాలతో ఓ ప్రేమకథ అని టాక్. కాగా ఈ సినిమా టైటిల్ కూడా రెండు రోజుల్లో వెల్లడి కానుంది. చందమామ కథలు పిక్చర్స్ పతాకంపై జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, అశ్విని దత్ సమర్పకురాలిగా పనిచేస్తున్నారు. మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

తాజా వార్తలు