లేట్ చేసినా ‘పెద్ది’ తమిళ్ సాంగ్ స్పెషల్!

లేట్ చేసినా ‘పెద్ది’ తమిళ్ సాంగ్ స్పెషల్!

Published on Nov 8, 2025 11:00 AM IST

Peddi

ప్రస్తుతం మ్యూజిక్ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సాంగ్ ఏదన్నా ఉంది అంటే అది మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ చార్ట్ బస్టర్ సాంగ్ చికిరి చికిరి అనే చెప్పాలి. అయితే ఈ సాంగ్ ని మేకర్స్ మొదటగా తెలుగు, హిందీ ఇంకా మలయాళ, కన్నడ భాషల్లో మాత్రమే వదిలారు. దీనితో తమిళ ఆడియెన్స్ ఒకింత డిజప్పాయింట్ అయ్యారు.

దీనితో మేకర్స్ కొంచెం లేట్ చేసినప్పటికీ తక్కువ వ్యవధిలోనే తమిళ వెర్షన్ ని కూడా వదిలారు. అయితే ఈ తమిళ్ వెర్షన్ ఇంకొంచెం స్పెషల్ అని చెప్పాలి. ఎందుకుంటే తమిళ్ వెర్షన్ కి ఈ సినిమా సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ కొడుకే తన గాత్రం అందించడం విశేషం. తమిళ్ వెర్షన్ లో ఏ ఆర్ అమీన్ పాడడం జరిగింది. దీనితో తమిళ్ లో మరింత బూస్టప్ అని చెప్పవచ్చు. ఇలా ప్రస్తుతం తమిళ ఆడియెన్స్ ని కూడా ఈ సాంగ్ ఎంతగానో అలరిస్తుంది.

తాజా వార్తలు