పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కత్రీనా-విక్కీ విశాల్ జంట

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కత్రీనా-విక్కీ విశాల్ జంట

Published on Nov 7, 2025 8:09 PM IST

బాలీవుడ్ సెలబ్రిటీ జంట విక్కీ కౌశల్‌ – కత్రినా కైఫ్‌ దంపతులకు శుక్రవారం నాడు పుత్రసంతానం కలిగింది. ఈ జంట సెప్టెంబర్‌ 23న తాము తల్లిదండ్రులం కాబోతున్న విషయాన్ని ప్రకటించారు. “ఇది మా జీవితంలోని అత్యంత అందమైన అధ్యాయం” అని పేర్కొన్నారు.

కాగా తాజాగా విక్కీ, కత్రినా తమ సోషల్ మీడియా పోస్టులో ఈ శుభవార్తను పంచుకున్నారు. “మా జీవితంలో మరో ఆనందం మొదలైంది. అపారమైన ప్రేమతో, కృతజ్ఞతతో మా బేబీ బాయ్‌ను స్వాగతిస్తున్నాం.” అని తమ సోషల్ మీడియాలో శుభవార్తను పంచుకున్నారు. వారికి సెలబ్రిటీలతో పాటు అభిమానుల శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

తాజా వార్తలు