‘పరాశక్తి’ ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..!

‘పరాశక్తి’ ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..!

Published on Nov 4, 2025 6:00 PM IST

parasakthi

తమిళ హీరో శివకార్తికేయన్ ‘అమరన్’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘మదరాసి’ యావరేజ్ చిత్రంగా నిలిచింది. ఇక ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రం ‘పరాశక్తి’తో ప్రేక్షకులను రంజింపజేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాను లేడీ డైరెక్టర్ సుధా కొంగర డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను పీరియాడిక్ నేపథ్యంలో రూపొందిస్తుండటంతో ఇందులో ఎలాంటి కంటెంట్ ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. కాగా, ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను నవంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఇక ఈ సినిమాలో రవి మోహన్, అథర్వ, శ్రీలీల తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు