తమిళ సినిమా నుంచి ఈ కొన్నేళ్లలో థియేటర్స్ లో సాలిడ్ ఎక్స్ పీరియెన్స్ అందించిన సినిమాల్లో నటుడు కార్తీ, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన ఖైదీ కూడా ఒకటి. ఇక ఈ సినిమాకి సీక్వెల్ పై అయితే నెక్స్ట్ లెవెల్ అంచనాలు ఉన్నాయి. అయితే పార్ట్ 1 ని మలేషియాలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.
అక్కడి నటుడు ఆరోన్ అజీజ్ నటించిన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కార్తీ రోల్ ని తను పోషించగా లేటెస్ట్ గా ఓ పిక్ వైరల్ గా మారింది. మలేషియాలో ఖైదీ గా కనిపించిన ఈ నటుడు తమిళ ఖైదీ కార్తీతో కలిసి కనిపించడం జరిగింది.
అక్కడ ఖైదీ సినిమాని “బందువా” గా రీమేక్ చేయగా ఆ సినిమా ప్రీమియర్ కి కార్తీ కూడా హాజరైనట్టు తెలుస్తోంది. మరి కార్తీ డిల్లీగా కనిపిస్తే ఆరోన్ డలి గా కనిపించనున్నాడు. దీనితో ఈ పిక్ ఖైదీ ఫ్యాన్స్ లో మంచి ఫోటో మూమెంట్ గా మారింది.


