ఇండియన్ సినిమా గేమ్ ఛేంజర్ బాహుబలి సినిమాలు రెండు కలిపి ఒక్క భాగంగా ఇప్పుడు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు రాజమౌళి హీరో ప్రభాస్ విలన్ రానా చేసిన స్పెషల్ ఇంటర్వ్యూలో లో క్రేజీ అంశం రివీల్ అయ్యింది.
అంతా ఆసక్తిగా ఉన్న బాహుబలి 3 పై బిగ్ అప్డేట్ జక్కన్న అందించారు. బాహుబలి 3 టైటిల్ ఏంటో తెలుసా “బాహుబలి ది అల్టిమేట్”గా ఉండనుంది అట. ఈ సినిమా ఒక సరైన సమయంలో కుదురుతుంది అని తెలిపారు. సో బాహుబలి 3 ఉంది కానీ అది ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం కాలమే నిర్ణయించే పరిస్థితికి వెళ్ళింది అని చెప్పాలి.
ఇక మరో సర్ప్రైజ్ గా ఎపిక్ సినిమా థియేటర్లులో బాహుబలి యానిమేషన్ సిరీస్ టీజర్ ఉంటుంది అని తెలిపారు. హై ఎండ్ 3డి విజువల్స్ తో “బాహుబలి – ది ఎటర్నల్ వార్” గా ఈ సిరీస్ ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు. మొత్తనికి ఇలా జక్కన్న నుంచి రెండు సెన్సేషనల్ అప్డేట్స్ రివీల్ అయ్యాయి.


