బలుపు పై బోలెడు ఆశలు పెట్టుకున్న రవితేజ

బలుపు పై బోలెడు ఆశలు పెట్టుకున్న రవితేజ

Published on Jun 17, 2013 10:00 PM IST

Balupu (6)
మాస్ మహారాజ రవితేజ మరోసారి నిర్మాతల నమ్మకాన్ని నిలబెట్టాడు. అతని సినిమాలు మినిమం గ్యారంటీగా నిలుస్తాయని ఒక వినికిడి. కానీ ప్రస్తుతం అతను హిట్లకోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ ‘బలుపు’ సినిమాతో తన అదృష్టాన్ని పరిక్షించుకొనున్నాడు.

ఈ సినిమా ఒక మాస్ మసాల ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఇండస్ట్రీలో ఈ సినిమా రూపుదిద్దుకున్న విధానంపై ఇప్పటికే ఈ సినిమాపై మంచి వార్తలే వినిపిస్తున్నాయి . ఈ సినిమాతో తన భవిష్యత్ ఆధారపడి వుంటుందికనుక ఈ చిత్రం కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాడు.

శృతి హాసన్ ఈ సినిమాలో పూర్తిస్థాయి గ్లామర్ పాత్ర పోషించనుంది. అంజలి రెండో హీరోయిన్. థమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రం పి.వి.పి సినిమా బ్యానర్ పై భారీ బడ్జెట్ లో రూపుదిద్దుకుంది. ఈ సినిమా ఈ నెల 28న విడుదలకానుంది.

తాజా వార్తలు