తండ్రి కోసం గ్రాండ్ ప్లాన్ చేస్తున్న పూరి కొడుకు

తండ్రి కోసం గ్రాండ్ ప్లాన్ చేస్తున్న పూరి కొడుకు

Published on Jun 17, 2013 1:17 PM IST

Puri-jagannath-and-Akash

డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ ని తన తండ్రి తో తనకున్న బందాన్ని తెలియజేశాడు. ఆకాష్ ‘ధోని’ లాంటి సినిమాలలో నటించి నటుడిగా మంచి పేరును సంపాదించుకున్నాడు. ఆకాష్ తన తండ్రి కోసం గ్రాండ్ గా కొన్ని ప్లాన్స్ చేస్తున్నాడు. ఫాదర్స్ డే సందర్భంగా ఈ విషయాలని ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలియజేశాడు. ‘మా నాన్న చాలా హార్డ్ వర్కర్. తను చాలా సహనంతో వుంటాడు. తను ప్రపంచంలోనే మంచి తండ్రి , అయన నాకు తండ్రి కావడం నా పూర్వ జన్మ సుకృతం. నేను తన కోసం పెద్ద ప్లాన్ వేస్తున్నాను. నేను ఏదో ఒక రోజు ఆయనకి రోల్స్ రాయిస్ కారుని బహుమతిగా ఇస్తానని’ అన్నాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆకాష్ తన కెరీర్ గురించి కూడా తెలియ జేశాడు. ‘నేను రజినీకాంత్ లా మాస్ హీరోని కావాలనుకుంటున్నాను. నా మొదటి సినిమాని మా నాన్న డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నానని’ అన్నాడు.

తాజా వార్తలు