ఎన్.టి.ఆర్ కి అమెరికాలో అరుదైన గౌరవం

ఎన్.టి.ఆర్ కి అమెరికాలో అరుదైన గౌరవం

Published on Jun 17, 2013 11:08 AM IST

ntr-coin-in-america

తెలుగు చలన చిత్ర రంగంలో ఓ వెలుగు వెలిగి, ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అన్నగా అండగా నిలబడ్డ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామరావుకి మరో అరుదైన గుర్తింపు దక్కనుంది. ఈ అరుదైన గౌరవానికి అమెరికాలోని తెలుగువారు పూనుకోవడం విశేషం. భారత చలన చిత్ర పరిశ్రమ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు ఇండో ఆమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రికి విరాళాల సేకరణ నిమిత్తం ఎన్టీఆర్‌పై నాణెం విడుదల చేయనున్నారు. ఈ నాణెంను జూన్ 28, 29 తేదీల్లో విడుదల చేస్తారు. ఈ నాణేనికి ఒకవైపు ఎన్టీఆర్‌ చిత్రం, మరోవైపు బసవతారకమ్మ కాన్సర్ ఆసుపత్రి చిహ్నాలు ఉంటాయని దానిని రూపొందించిన గోల్డెన్‌ లైన్‌ సంస్థ ప్రతినిధులు నాగేశ్వరరావు, రామిరెడ్డి తెలిపారు. ఆ గోల్డ్ కాయిన్ ఎలా ఉంటుందో అనేది మీరు పై ఫోటోలో చూడవచ్చు. ఎన్టీఆర్ పై నాణెం విడుదల అవుతుండటంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు