ఇటీవల కాలంలో సినిమా రిలీజ్‌ల ముందు తరచుగా వినిపిస్తున్న పదం “సింపతీ కార్డు”. మాటలతో గానీ, ప్రవర్తనలతో గానీ ప్రేక్షకుల సానుభూతి పొందాలని కొందరు హీరోలు, దర్శకులు ప్రయత్నిస్తున్నారు, కానీ వాస్తవంలో అది పెద్దగా పనిచేయడం లేదు.
‘కె ర్యాంప్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత రాజేష్ దండా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. “ఏడుపులు, డ్రామాలు వద్దు, సినిమా కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు వస్తారు.” పోటీలో ఉన్న ‘తెలుసు కదా’, ‘డ్యూడ్’ టీమ్‌లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నారు అనే విషయంపై సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాజేష్ దండా, హీరో కిరణ్ అబ్బవరం ఇద్దరూ ఈ కార్యక్రమంలో కాన్ఫిడెంట్‌గా కనిపించారు. గతంలో ‘దిల్ రుబా’తో నిరాశ ఎదుర్కొన్న కిరణ్, ఇప్పుడు ‘కె ర్యాంప్’తో కంబ్యాక్ చేస్తాడని ధీమాగా ఉన్నాడు.