‘ఫౌజీ’ సాలిడ్ అప్డేట్.. వచ్చేది అప్పుడే..!

‘ఫౌజీ’ సాలిడ్ అప్డేట్.. వచ్చేది అప్పుడే..!

Published on Oct 16, 2025 7:00 AM IST

Fauji-0

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే, ఈ సినిమాకు సంబంధించిన సాలిడ్ అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక దీనికి సంబంధించి దర్శకుడు హను రాఘవపూడి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ ఎంతో స్పెషల్ అయిన ప్రభాస్ బర్త్ డే కానుకగా రాబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

అదే రోజు ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు