‘ది రాజా సాబ్’ ఆలస్యానికి కారణం పుష్ప రాజ్..?

‘ది రాజా సాబ్’ ఆలస్యానికి కారణం పుష్ప రాజ్..?

Published on Oct 14, 2025 8:00 PM IST

Vishwa-Prasad

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది రాజా సాబ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

అయితే, ఈ చిత్రాన్ని పలుమార్లు వాయిదా వేశారు మేకర్స్. ఈ చిత్ర రిలీజ్ వాయిదా పడటానికి పలు కారణాలు ఉన్నాయని.. వాటిలో వీఎఫ్ఎక్స్ విభాగం కూడా ఒకటని విశ్వ ప్రసాద్ తెలిపారు. గతంలో వీఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో ‘పుష్ప 2’ పనుల్లో బిజీగా ఉన్నామని.. అది పూర్తయ్యాకే రాజాసాబ్ చేస్తామని వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ ఒకరు తనతో చెప్పాడంటూ విశ్వప్రసాద్ తెలిపారు.

ఇలా విశ్వ ప్రసాద్ చేసిన ఓ వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.

తాజా వార్తలు