స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘తెలుసు కదా’ దీపావళి కానుకగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాను నీరజా కోన డైరెక్ట్ చేస్తుండగా అందాల భామలు రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.
ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమాలోని కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ చిత్ర రన్‌టైమ్‌ను 2 గంటల 15 నిమిషాలకు లాక్ చేసినట్లు తెలుస్తోంది.
రొమాంటిక్ లవ్ స్టోరీకి ఈ రన్ టైమ్ పర్ఫెక్ట్గా సరిపోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.