రాజమౌళి ‘బాహుబలి: ది ఎపిక్’ అనే కొత్త వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రెండు భాగాలు కలిపి, రీ-కట్ చేసి, రీ-మాస్టర్ చేసిన ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా గత కొన్ని వారాలుగా, బాహుబలి బృందం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి చాలా గంటలు శ్రమిస్తోంది. కాగా సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఒక క్రేజీ అప్‌డేట్‌ను పంచుకున్నారు, బాహుబలి: ది ఎపిక్ కోసం కలర్ గ్రేడింగ్ పని పూర్తయిందని వెల్లడించారు.
అదేవిధంగా విజువల్స్ కూడా ఉత్కంఠభరితంగా ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి మరియు తమన్నా భాటియా నటించిన బాహుబలి భారతీయ సినిమాలో అత్యంత ప్రసిద్ధ చిత్రాలలో ఒకటిగా మిగిలిపోయింది. ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ ఎపిక్ వెర్షన్ మరి లాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.