భవప్రీతా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ యం రెడ్డి నిర్మించిన చిత్రం ‘లవ్ ఓటిపి’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. 2 నిమిషాల 27 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్, ఒకేసారి ఇద్దరు అమ్మాయిలను ప్రేమించి ఇబ్బందుల్లో పడే ఒక యువకుడి కథను హాస్యభరితంగా చూపించింది.
ఈ సినిమాలో అనిష్, జాన్విక, స్వరూపిణిలు హీరోహీరోయిన్లుగా నటించగా, ప్రేమంటే ఇష్టం లేని పోలీస్ ఆఫీసర్ తండ్రి పాత్రలో రాజీవ్ కనకాల మెప్పించారు. ఈ చిత్రానికి అనీష్ దర్శకత్వం వహించడమే కాకుండా, కథానాయకుడిగానూ నటించడం విశేషం.
నిర్మాత విజయ్ యం. రెడ్డి మాట్లాడుతూ, ఈ సినిమా ఫ్రెష్ కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తుందని, అనిష్ దర్శకుడిగా, నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ చిత్రానికి ఆనంద్ రాజా విక్రమ్ సంగీతం అందించగా, హర్ష సినిమాటోగ్రఫీని, శరత్ ఎడిటింగ్‌ను నిర్వహించారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


