‘బాహబలి – ది ఎపిక్’… ఈసారి అది లేనట్టేనా..?

‘బాహబలి – ది ఎపిక్’… ఈసారి అది లేనట్టేనా..?

Published on Oct 10, 2025 2:00 AM IST

Baahubali The Epic

ఇటీవల కాలంలో పెరుగుతున్న టికెట్ ధరలు ప్రేక్షకులకు భారంగా మారాయి. ఈ ధోరణి రాజమౌళి చిత్రాలతో మొదలైందని సినిమా లవర్స్ చెబుతుంటారు. ఆయన సినిమాల గ్రాండియర్ చూసి అభిమానులు అధిక ధరలను అంగీకరించినా, తర్వాత చాలా సినిమాలు అదే కారణంగా రేట్లు పెంచాయి. దీంతో సగటు ప్రేక్షకుడు థియేటర్‌కు రావడానికి సంకోచిస్తున్నాడు.

ఇక ఇప్పుడు రాజమౌళి ‘బాహుబలి: ది ఎపిక్’ అనే కొత్త వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రెండు భాగాలు కలిపి, రీ-కట్ చేసి, రీ-మాస్టర్ చేసిన ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈసారి కూడా ఆయన టికెట్ రేట్లు పెంచుతారని అందరూ అనుకున్నారు. కానీ చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఎలాంటి టికెట్ రేటు పెంపు ఉండదట. ఇండియాతో పాటు ఓవర్సీస్‌లనూ సాధారణ ధరలకే ఈ సినిమా ప్రదర్శించనున్నారు.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా లీడ్ రోల్స్‌లో నటించిన ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ ఎపిక్ వెర్షన్ చిత్రం ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

తాజా వార్తలు