పాతికేళ్ల ‘జయం మనదేరా..!’.. ఈ విషయం మీకు తెలుసా..?

పాతికేళ్ల ‘జయం మనదేరా..!’.. ఈ విషయం మీకు తెలుసా..?

Published on Oct 7, 2025 5:00 PM IST

విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ఎన్.శంకర్ తెరకెక్కించగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘన విజయం సాధించింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికి 25 ఏళ్లు పూర్తయ్యింది.

దీంతో ఈ చిత్రానికి సంబంధించిన జ్ఞాపకాలను చిత్ర యూనిట్ నెమరేసుకుంటున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు ఎన్.శంకర్ రాసుకున్న క్లైమాక్స్ వేరేలా ఉందట. అయితే, అది విన్న వెంకటేష్ ఓ బాలీవుడ్ చిత్రంలోని క్లైమాక్స్ ఆధారంగా యాక్షన్‌తో సినిమా క్లైమాక్స్ చేయాలని సూచించాడట. దీంతో నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ వారు శంకర్‌ని రెండు క్లైమాక్స్‌లు తీయమని.. ఏది బాగుంటే అది పెట్టుకుందామని తెలిపారట.

ఈ క్రమంలో సమయం లేకపోవడంతో శంకర్ వెంకటేష్ సూచించిన బాలీవుడ్ తరహా క్లైమాక్స్‌నే రూపొందించాడట. ఇక ఈ చిత్రానికి వందేమాత్రం శ్రీనివాస్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు