‘మాస్ జాతర’లో రవితేజ రోల్ రివీల్!

‘మాస్ జాతర’లో రవితేజ రోల్ రివీల్!

Published on Oct 7, 2025 3:00 PM IST

Mass-Jathara

మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా కొత్త దర్శకుడు భాను బోగవరపు తెరకెక్కించిన అవైటెడ్ మాస్ చిత్రమే “మాస్ జాతర”. వింటేజ్ రవితేజని చూపించే విధంగా సాలిడ్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేసిన ఈ సినిమాకి మేకర్స్ ఇపుడు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేసారు. ఇలా టీం ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇలా రవితేజ తన రోల్ ని రివీల్ చేశారు.

ఈ చిత్రంలో రవితేజ పోలీస్ గానే కనిపిస్తారని అందరికీ తెలిసిందే కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఇది వరకు మనం చూసిన పోలీస్ లా కాకుండా ఒక ఆర్ పి ఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) లోని పోలీస్ గా తాను కనిపిస్తారని రివీల్ చేశారు. సినిమా మంచి ఫుల్ ఫన్ గా అలాగే ఎమోషనల్ గా కూడా ఉంటుంది అని రవితేజ రివీల్ చేశారు. సో ఈ అక్టోబర్ 31న ఫ్యాన్స్ కి థియేటర్స్ లో మంచి ట్రీట్ ఉండనుంది అని చెప్పొచ్చు.

తాజా వార్తలు