వాటి నుంచి కూడా నేర్చుకోండి – సమంత

వాటి నుంచి కూడా నేర్చుకోండి – సమంత

Published on Oct 7, 2025 12:30 AM IST

samantha

హీరోయిన్ సమంత సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. ఇదే క్రమంలో తాజాగా సామ్ తన ఇన్‌స్టాలో ఫాలోవర్స్‌తో ముచ్చటిస్తూ.. కొన్ని ప్రశ్నలకు ఆసక్తికర సమాధానమిచ్చింది. ఓ నెటిజన్ సమంతను ప్రశ్నిస్తూ.. ‘మీ జీవితాన్ని మార్చిన కొటేషన్‌ను చెప్పండి ?’ అని అడిగారు. ఈ ప్రశ్నకు సమంత సమాధానమిస్తూ.. ‘మనల్ని ఇబ్బందిపెట్టే ప్రతి విషయం మనకు పాఠం నేర్పుతుంది. అలాంటి వాటినుంచి కూడా ఏదో ఒకటి నేర్చుకోండి’ అంటూ తెలిపింది.

మరో నెటిజన్ ప్రస్తుతం మీ తెలుగు ప్రాజెక్ట్‌ ఏంటి ? అని అడగగా.. ‘మా ఇంటి బంగారం’. ఈ నెలలో దీని షూటింగ్‌ ప్రారంభమవుతుంది అని సమంత క్లారిటీ ఇచ్చింది. ఈశా ఫౌండేషన్‌ అంటే ఎందుకు ఇష్టం ? అనే ప్రశ్నకు.. అది నాకు మరో ఇంటితో సమానం. అక్కడికి వెళ్తే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ‘ అని సమంత తెలిపింది. ఆరోగ్య సమస్యలతో నటనకు కొంతకాలం విరామం ఇచ్చిన సమంత, ప్రస్తుతం మళ్లీ యాక్టివ్ అయింది.

తాజా వార్తలు