The Paradise : జడల్‌తో యుద్ధానికి సై అంటున్న మోహన్ బాబు.. రెట్రో లుక్‌తో గ్రాండ్ ఎంట్రీ..!

The Paradise : జడల్‌తో యుద్ధానికి సై అంటున్న మోహన్ బాబు.. రెట్రో లుక్‌తో గ్రాండ్ ఎంట్రీ..!

Published on Sep 27, 2025 5:21 PM IST

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైస్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రెస్టీజియస్‌గా డైరెక్ట్ చేస్తున్నారు.

కాగా, ఈ సినిమాలో విలన్ పాత్రలో కలెక్షన్ కింగ్ డా.ఎం.మోహన్ బాబు నటిస్తున్నట్లు మేకర్స్ నేడు ప్రకటించారు. ఆయనకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే, తాజాగా ఆయన పోషిస్తున్న షికంజ మాలిక్ రెట్రో లుక్‌తో నోటిలో సిగార్, చేతిలో గన్ పట్టుకుని స్టైలిష్‌గా నడుస్తున్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌తో మోహన్ బాబు పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు