నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం ది ప్యారడైజ్ కోసం అందరికీ తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ మాస్ చిత్రంలో సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా సాలిడ్ రోల్ చేస్తున్న సంగతి ఇది వరకే తెలిసిందే. మరి మేకర్స్ తనపై నిజంగా ఒక షాకింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని అయితే రిలీజ్ చేసారని చెప్పాలి.
ఈ సినిమాలో నాని ఒక్కడే డేరింగ్ మేకోవర్ చేసాడు అనుకుంటే మోహన్ బాబు కూడా ఇప్పుడు ఇదే తరహా మేకోవర్ లో కనిపించి షాకిచ్చారు అని చెప్పాలి. డెఫినెట్ గా తన లుక్ ని మాత్రం ఎవ్వరూ ఇలా ఊహించి ఉండకపోవచ్చు. మరి లుక్కే ఇలా ఉంటే ఇక సినిమాలో పీక్ పెర్ఫామెన్స్ ని ఆశించవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వచ్చే ఏడాది మార్చ్ 26న పాన్ వరల్డ్ లెవెల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది.