తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సునామీ.. ఫస్డ్ డే షేర్ వసూళ్లతో పవన్ ర్యాంపేజ్..!

తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సునామీ.. ఫస్డ్ డే షేర్ వసూళ్లతో పవన్ ర్యాంపేజ్..!

Published on Sep 26, 2025 6:00 PM IST

OG movie Review

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘ఓజీ’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రానికి తొలిరోజే అదిరిపోయే టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా విడుదలైన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.154 కోట్ల గ్రాస్ వసూలు చేసి, పవన్ కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనింగ్ రికార్డ్ సృష్టించింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ మాస్ ఎంటర్టైనర్ డిస్ట్రిబ్యూటర్లకు మొత్తం రూ.63 కోట్ల (GSTతో కలిపి) షేర్‌ను అందించింది. ఇందులో నైజాంలో రూ.24 కోట్లు భారీ షేర్ వచ్చింది. సీడెడ్‌లో రూ.7.5 కోట్లు, ఆంధ్రలో రూ.31.5 కోట్ల షేర్ రాబట్టింది.

సెప్టెంబర్ 24 రాత్రి నిర్వహించిన పెయిడ్ ప్రీమియర్స్ ‘ఓజీ’కి పెద్ద మేలు చేశాయి. ఇక ఈ వీకెండ్ వరకు ఈ చిత్రం ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. DVV దానయ్య నిర్మించిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, ఇమ్రాన్ హష్మీ విలన్‌గా మెప్పించాడు. థమన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు