రజినికాంత్ సినిమా జాప్యానికి కారణమేంటి?

రజినికాంత్ సినిమా జాప్యానికి కారణమేంటి?

Published on Jun 15, 2013 12:00 PM IST

Kochadaiyaan

సూపర్ స్టార్ రజినికాంత్ నటిస్తున్న గ్రాఫికల్ మాయాజాలమైన ‘కొచ్చాడయాన్’ దీపావళి పండుగ సందర్భంగా నవంబర్లో విడుదలకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మానంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. వి.ఎఫ్.ఎక్స్ పనుల జాప్యం వలన పోస్ట్ ప్రొడక్షన్ పనులలో జాప్యం కలుగుతుంది. నయనానందకరంగా రంజింపచేసే విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు ఈ ఆలస్యం సాధారణం. తెలుగులో ఈ సినిమా ‘విక్రమ సింహా’ పేరుతొ అనువాదంకానుంది.

ఈ సినిమాలో అంతర్జాతీయ స్థాయి టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ‘అవతార్’ సినిమాకు పనిచేసిన స్టీరియో స్కోప్ బృందమంతా ఈ సినిమాకు పనిచెయ్యడం విశేషం. ఈ సినిమాలో దీపికా పదుకునె హీరోయిన్. శరత్ కుమార్, ఆది, శోభన, రుక్మిణి, జాకీ షరాఫ్ మరియు నాజర్ ప్రధాన పాత్రధారులు

రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించారు

తాజా వార్తలు