పవన్ కళ్యాణ్ నటించిన OG బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ భారీ చిత్రానికి నిన్నటి పెయిడ్ ప్రీమియర్స్లో అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇక నేడు కూడా ఈ చిత్రం సెన్సేషనల్ ఓపెనింగ్స్ రాబడుతోంది. ఇమ్రాన్ హష్మీ విలన్గా, ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించారు.
తాజాగా ఈ చిత్ర సక్సెస్ మీట్లో నిర్మాత డీవీవీ దానయ్య ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. “ప్రారంభంలో ‘OG’ టైటిల్ నాగవంశీ గారు రిజిస్టర్ చేసుకున్నారు. నేను అడిగిన వెంటనే ఆయన ఎలాంటి సంకోచం లేకుండా ఆ టైటిల్ను నాకు ఇచ్చేశారు. ఈ స్థాయి క్రేజ్ ఉన్న సినిమా ‘OG’ టైటిల్ వల్ల మరింత లాభపడింది. నాగవంశీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు.
అయితే, నాగవంశీ ఈ టైటిల్ ఏ హీరో కోసం రిజిస్టర్ చేయించాడా అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ విషయంపై నాగవంశీ రెస్పాండ్ అవుతారేమో చూడాలి.