సమీక్ష: ‘ఓజి’ – మెప్పించే స్టైలిష్ యాక్షన్ డ్రామా

సమీక్ష: ‘ఓజి’ – మెప్పించే స్టైలిష్ యాక్షన్ డ్రామా

Published on Sep 25, 2025 7:06 AM IST

OG Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 25, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్, ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రేయ రెడ్డి, వెంకట్ తదితరులు
దర్శకుడు : సుజీత్
నిర్మాత : డీవివి దానయ్య, కళ్యాణ్ దాసరి
సంగీత దర్శకుడు :  ఎస్.ఎస్. తమన్
సినిమాటోగ్రాఫర్ : రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస
ఎడిటర్ : నవీన్ నూలి

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఈ ఏడాది ఒక వైఫల్యం తర్వాత దాని ఎఫెక్ట్ ఏమాత్రం కూడా లేకుండా వచ్చిన మోస్ట్ అవైటెడ్ చిత్రమే “ఓజి”. యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ హైప్ తో వచ్చింది. మరి ఆ హైప్ ని ఈ సినిమా మ్యాచ్ చేసిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం రండి.

కథ:

1993 సమయంలో ముంబై పోర్ట్ కి దాదా అయినటువంటి సత్య దాదా (ప్రకాష్ రాజ్) కి అండగా ఓజాస్ గంభీర (పవన్ కళ్యాణ్) అండగా ఉంటాడు. కానీ ఓ కారణం చేత గంభీర సత్య దాదా నుంచి దూరం కావాల్సి వస్తుంది. అక్కడ నుంచి ఆ పోర్ట్ పై చాలా మంది కన్ను పడుతుంది. గంభీర ఎందుకు సత్య దాదాకి దూరం అయ్యాడు? అసలు ఇద్దరికీ లింక్ ఎలా కుదిరింది? ఇంకోపక్క అర్జున్ (అర్జున్ దాస్) గంభీరని ఎందుకు చంపాలి అనుకుంటాడు. ఓమిగా పిలవబడే ఓంకార్ వర్ధమాన్ (ఇమ్రాన్ హష్మీ) తాలూకా ఆర్డియక్స్ కంటైనర్లు సత్య దాదా పోర్ట్ వచ్చాక ఏమయ్యాయి? ఈ మధ్యలో గంభీర కోల్పోయింది ఏంటి? అసలు ఈ గంభీర ఎవరు? అతని గతం ఏంటి అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

పవన్ కళ్యాణ్ నుంచి ఎంతో కాలంగా మిస్ అవుతున్న ఒక స్టైలిష్ గ్యాంగ్ స్టర్ తరహా ట్రీట్ కోసం చూస్తున్న వారికి ఓజి ఒక జంబో బిర్యానీ ప్యాక్ లాంటిది అని చెప్పవచ్చు. ఇలా కదా తాము తమ అభిమాన హీరోని చూడాలి అనుకుంటున్నాం అనే ఫ్యాన్స్ మదిలోని మాటకి సుజీత్ తన ప్రెజెంటేషన్ తో సమాధానం అందించాడు అని చెప్పాలి.

ఒక పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ గా పవర్ స్టార్ తన మార్క్ స్వాగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో డైనమిక్ గా స్క్రీన్ పై కనిపించారు. తనపై ప్రతీ సన్నివేశం మంచి పవర్ఫుల్ గా ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. తన నటన కూడా వింటేజ్ పవర్ స్టార్ ని తలపిస్తే ఇక యాక్షన్ కోసం డెఫినెట్ గా చెప్పాల్సిందే. మార్షల్ ఆర్ట్స్ లో పవన్ కళ్యాణ్ కి ఉన్న నైపుణ్యత ఏపాటిదో తెలుగు ప్రేక్షకులకి చెప్పాల్సిన పని లేదు.

ఇటీవల హరిహర వీరమల్లు సినిమాలో కూడా పవన్ సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో అదరగొట్టారు. ఇక ఇది అందుకు ఇంకా భిన్నం అయితే ఇందులోనీ పవర్ స్టార్ తన మ్యాజిక్ చూపించారని చెప్పాలి. ఒక సమురాయ్ గా అయితేనేం.. ఒక బ్రూటల్ గ్యాంగ్ స్టర్ లా అయితేనేం ఒక ఊచకోత తాను స్క్రీన్ పై చూపించారని చెప్పవచ్చు. పర్టిక్యులర్ గా తనపై డిజైన్ చేసిన ప్రతీ యాక్షన్ బ్లాక్ మంచి స్టైలిష్ గా ఫ్యాన్స్ ని ఆశ్చర్య పరిచేలా ఉన్నాయి.

అలాగే ఓజాస్ కంప్లీట్ గా యాక్షన్ లో దిగాక సీన్స్ కూడా ఫాన్స్ కి ఫీస్ట్ ఇస్తాయి. ఇక తనతో పాటుగా నటించిన హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ఒకింత ఆశ్చర్య పరుస్తుంది అని చెప్పవచ్చు. తన నటన అయితే ఏమి పవన్ కళ్యాణ్ తో కెమిస్ట్రీ కానీ ఇది వరకు చూసిన ప్రియాంకేనా అన్నట్టు అనిపిస్తుంది.

ఇక వీరితో పాటుగా విలన్ గా ఇమ్రాన్ హష్మీకి సాలిడ్ సీన్స్ పడ్డాయి. తనకి సోలోగా మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ తో కూడా మంచి పవర్ఫుల్ సన్నువేశాలు దక్కాయని చెప్పాలి. ఇక వీరితో పాటుగా అర్జున్ దాస్ కి మంచి రోల్ దక్కింది. తనకు చాలా ఇంపార్టెన్స్ ఇందులో కనిపించగా తనతో పాటుగా నటి శ్రేయ రెడ్డి కూడా సాలిడ్ రోల్ లో కనిపించి మెప్పిస్తుంది.

ఇక నటుడు ప్రకాష్ రాజ్ సత్య దాదాగా ఎప్పటిలానే మంచి నటన కనబరిచారు. ఇంకా సెకండాఫ్ లో సాలిడ్ స్కోర్ తో సాగే సన్నివేశాలు మంచి హై ఇచ్చే యాక్షన్ బ్లాక్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటాయి. వీటితో పాటుగా సుజీత్ ఇచ్చిన తన సినిమాటిక్ యూనివర్స్ లింక్ సర్ప్రైజ్ కలిగిస్తుంది. ఇక మరో ఇంప్రెస్ చేసే అంశం ఇందులో కెమెరా వర్క్ అండ్ సంగీతం అని చెప్పాలి. ఈ రెండు పార్ట్స్ మాత్రం సినిమాలో చాలా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్:

ఈ పర్టిక్యులర్ సినిమా విషయంలో మొదటి నుంచీ చాలా మందికి ఒక క్లారిటీ అయితే ఉంది. ఆల్రెడీ అందరికీ తెలిసిన ఒక గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ అందులో హీరోకి ఓ ఫ్లాష్ బ్యాక్ ఈ టెంప్లెట్ ని అంతా ఫిక్స్ అయ్యారు.

అలా ఊహించిన రీతిలోనే ఇందులో ప్లాట్ కూడా కనిపిస్తుంది. సో మరీ కొత్తదనం కోరుకునేవారు డిజప్పాయింట్ అవుతారు. అలాగే పవన్ కి ఒక పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తప్పితే మిగతా అంశాలు మాత్రం చాలా రొటీన్ గా కనిపించాయి అని చెప్పక తప్పదు.

ఒక రొటీన్ రివెంజ్ యాక్షన్ ఫ్లిక్ లో యకూజాలు, సమురాయ్ పాయింట్ తప్పితే ఇంకో అంశం పెద్దగా ఎగ్జైట్ చేయదు. ఇక వీటితో పాటుగా సినిమాలో వావ్ అనిపించే సాలిడ్ ట్విస్ట్ లు టర్నింగ్ లు లాంటివి కూడా కనిపించవు. బలమైన ఘర్షణ, ఇంకా ఏదో మిస్సవుతుంది, ఏదో మిస్సవుతుంది అన్న ఫీల్ లోనే సినిమా కొనసాగుతుంది.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం సాలిడ్ గా ఉన్నాయి. మొదటి నుంచీ మేకర్స్ భారీ మొత్తంలో ఈ సినిమాకి ఖర్చు చేసినట్టు టాక్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రతీ ఫ్రేమ్ ని ఎంతో రిచ్ గా తీర్చిదిద్దారని చెప్పాలి. ఇక రవి కె చంద్రన్, మనోజ్ పరమహంసల సినిమాటోగ్రఫీ వర్క్ కూడా పీక్ లెవెల్లో ఉంది. సాలిడ్ విజువల్స్ ని తాము ప్రెజెంట్ చేశారు. థమన్.. ఈ మ్యాన్ కోసం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తను గట్టి డ్యూటీనే చేసాడు సినిమాకి ముఖ్యంగా సెకండాఫ్ లో థమన్ మ్యాజిక్ బాగా ప్లస్ అయ్యింది. నవీన్ నూలి ఎడిటింగ్ లో కథనాన్ని కొంచెం గ్రిప్పింగ్ గా మార్చింది.

ఇక దర్శకుడు సుజీత్ విషయానికి వస్తే.. తను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కావాల్సిన సాలిడ్ ఎలిమెంట్స్ బాగా డిజైన్ చేసుకున్నాడు. ఫ్యాన్స్ కి కావాల్సిన ఒక ఫ్యాన్ బాయ్ ఫీస్ట్ అందించే క్రమంలో కథనం పరంగా మాత్రం ఇంకా స్ట్రాంగ్ గా ప్లాన్ చేసుకోవాల్సింది. తన సినిమాటిక్ యూనివర్స్ కి కూడా లింక్ లు లాంటివి బాగానే చేసుకున్నాడు కానీ ఓజి కి నడిపించిన కథనం లో డోస్ సరిపోలేదు అనిపిస్తుంది కొంతమేర స్లోగా ఓకే రేంజ్ లో కొనసాగుతుంది. సో పవన్ వరకు మినహా మిగతా కథనం మాత్రం ఇంకా బలంగా, గ్రిప్పింగ్ గా డిజైన్ చేసుకోవాల్సింది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “ఓజి” పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సాలిడ్ ట్రీట్ అందిస్తుంది అని చెప్పాలి. సుజీత్ పవన్ కళ్యాణ్ ని ప్రెజెంట్ చేసిన విధానం క్రేజీ స్టఫ్ ని అందిస్తుంది. తన బ్యాక్ స్టోరీ కానీ తనపై ఎలివేషన్స్ కానీ యాక్షన్ సీన్స్ గాని ఫ్యాన్స్ కి ఓ రేంజ్ ట్రీట్ అందిస్తాయి. ఈ విషయంలో మాత్రం సుజీత్ సాలిడ్ వర్క్ అందించాడు. ఇక వీటితో పాటుగా థమన్ వర్క్ ఇంకా కెమెరా వర్క్ కూడా సినిమాలో ఇంప్రెస్ చేస్తుంది. కానీ ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీల్ ఉంటుంది. ఇది పక్కన పెడితే ఒక స్టైలిష్ అండ్ సాలిడ్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా చూడాలి అనుకుంటే ‘ఓజి’ ట్రీట్ ఇస్తుంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

తాజా వార్తలు