‘ఓజీ’కి సెన్సార్ షాక్.. రన్‌టైమ్ కూడా లాక్..!

‘ఓజీ’కి సెన్సార్ షాక్.. రన్‌టైమ్ కూడా లాక్..!

Published on Sep 22, 2025 6:07 PM IST

OG movie

ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఓజీ యుఫోరియా తో ఊగిపోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు సుజీత్ తెరకెక్కించగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

ఇక ఈ సినిమా ట్రైలర్‌కు సాలిడ్ రస్పాన్స్ లభిస్తుండటంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ పనులు కూడా తాజాగా పూర్తయినట్లు తెలుస్తోంది. ఓజీ చిత్రానికి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ జారీ చేసింది. యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండటం, వయొలెన్స్ వంటి అంశాలు ఈ చిత్రంలో ఉండటంతో ఈ మేరకు సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు.

ఇక ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 34 నిమిషాలుగా లాక్ చేశారట మేకర్స్. దీంతో ఈ సినిమా పక్కా రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని.. ఈ సినిమా అభిమానులకు ట్రీట్ ఇవ్వడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు