ట్రైలర్ టాక్ : భారీ యాక్షన్ తో అదరగొట్టిన ఓజీ !

ట్రైలర్ టాక్ : భారీ యాక్షన్ తో అదరగొట్టిన ఓజీ !

Published on Sep 22, 2025 3:02 PM IST

OG

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా సుజీత్‌ తెరకెక్కించిన చిత్రమే ‘ఓజీ’. ఈ సినిమా ఈనెల 25న విడుదల కానుంది. ఐతే, పవన్ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘ఓజీ’ ట్రైలర్‌ తాజాగా రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ లో పవన్‌ కల్యాణ్‌ స్టైలిష్‌ లుక్స్‌, తమన్‌ నేపథ్య సంగీతం హైలైట్‌గా ఉన్నాయి. ముఖ్యంగా పవన్‌ గ్యాంగ్‌ స్టర్‌ ఓజాస్‌ గంభీరగా నటించి మెప్పించాడు. ఇక ట్రైలర్ లో స్టైలిష్ మేకింగ్ అండ్ షార్ప్ కట్స్ మరియు భారీ యాక్షన్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.

అలాగే, మిగిలిన పాత్రలను కూడా చాలా చూపించారు. మొత్తమ్మీద ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. కాగా బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ విలన్‌ పాత్ర పోషించారు. ఈ సినిమా ఈ నెల 25న బాక్సాఫీస్ ముందుకు రాబోతుంది. డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి ఈ సినిమాని నిర్మించారు. ప్రియాంక మోహన్‌ కథానాయికగా నటించింది. ఈ సినిమా టికెట్స్ కోసం మరోవైపు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఇప్పుడున్న బజ్ ను బట్టి భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తాజా వార్తలు