విడుదల తేదీ : సెప్టెంబర్ 19, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : అక్షయ్ కుమార్, అర్షద్ వార్సి, సౌరబ్ శుక్ల, గజ్‌రాజ్ రావు, హ్యుమా ఖురేషి, అమృత రావు తదితరులు
దర్శకుడు : సుభాష్ కపూర్
నిర్మాతలు : అలోక్ జైన్, అజిత్ అంధారె
సంగీతం : అమన్ పంత్, అనురాగ్ సైకియా, విక్రమ్ మాంట్రోస్
సినిమాటోగ్రఫీ : రంగరాజన్ రామభద్రం
ఎడిటింగ్ : చంద్రశేఖర్ ప్రజాపతి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
బాలీవుడ్‌లో కోర్ట్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన మూవీ ‘జాలీ ఎల్ఎల్‌బి 3’ నేడు రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
ఢిల్లీ కోర్ట్ లో జగదీశ్వర్ మిశ్రా అలియాస్ జాలీ (అక్షయ్ కుమార్), జగదీశ్ త్యాగి అలియాస్ జాలీ (అర్షద్ వార్సి) తరుచూ గొడవ పడుతుంటారు. వారు ఓ మహిళా రైతు కేసులో ఇంపీరియల్ గ్రూప్ అధినేత హరిభాయ్ ఖేతాని(గజ్‌రాజ్)కి ఎదురువెళ్తారు. మరి ఈ కేసుని ఎవరు టేక్ అప్ చేశారు..? హరిభాయ్ ఖేతానికి వ్యతిరేకంగా వారికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరికి ఈ కేసు ని ఎవరు గెలిపించారు? అనేది సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
కోర్ట్ డ్రామా చిత్రాలలో జాలీ ఎల్ఎల్ బి కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. మొదటి రెండు చిత్రాలు ప్రేక్షకులకు మంచి కంటెంట్ తో పాటు పెర్ఫార్మన్స్ లు ఇచ్చాయి. ఇక ఇప్పుడు వచ్చిన మూడో చిత్రం కూడా అదే తరహాలో కొనసాగింది. ఇక ఈసారి ఇద్దరు జాలీలు ఈ సినిమాలో కనిపించడం ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అక్షయ్ కుమార్, అర్షద్ వార్సి తమదైన పర్ఫార్మెన్స్‌లతో ప్రేక్షకులను మెప్పించారు.
రైతుల పట్ల కార్పొరెట్ కంపెనీలు వ్యవహరించే తీరును మన కళ్లకు కట్టినట్లు చూపెట్టారు. రైతుల భూములను కార్పొరెట్ సంస్థలు ఎలా కైవసం చేసుకుంటాయి.. వాటి ఫలితంగా గ్రామాల్లో రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు అనేది మనకు ఈ సినిమాలో వివరంగా చూపెట్టారు. ఫస్ట్ హాఫ్‌లో హీరోల మధ్య పోటీ, వారు ఒకరిపై ఒకరు గెలిచేందుకు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఆకట్టుకుంటాయి.
అయితే, రైతు కేసుని వారు టేకప్ చేసిన తర్వాత కథ సీరియస్ మోడ్‌లోకి మారుతుంది. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయనేవి చక్కగా చూపెట్టారు. కథకు అనుగుణంగా వచ్చే బీజీఎం కూడా మెప్పిస్తుంది. గజ్‌రాజ్ తనదైన నటనతో ఆకట్టుకుంటాడు.
ఈ ఫ్రాంచైజీలో జడ్జీగా నటించిన సౌరబ్ శుక్లా మరోసారి ఈ సినిమాతో మెరిసారు. ఆయన తనదైన యాక్టింగ్‌తో ఈ సినిమాకు ప్రాణం పోశారు. మిగతా నటీనటులకు పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. కథను ముందుకు తీసుకెళ్లిన తీరు ప్రేక్షకులను మెప్పిస్తుంది.
మైనస్ పాయింట్స్ :
గత రెండు సినిమాలను చూసిన వారికి ఈ సినిమా పెద్దగా నచ్చదని చెప్పాలి. గత రెండు చిత్రాల్లో కూడా కోర్టు రూమ్‌లో డ్రామా ఆకట్టుకుంటుంది. కానీ, ఇందులో కోర్టు సీన్స్ తక్కువగా ఉండటం.. సమస్యకు సంబంధించిన సీన్స్ ఎక్కువగా ఉండటం కొంతవరకు మైనస్.
నటీనటుల విషయంలోనూ హీరోలు ఇద్దరు ఉన్నా క్రెడిట్ మాత్రం జడ్జీగా నటించిన సౌరబ్ శుక్లా కొట్టేశారు. అక్షయ్ కుమార్ పర్వాలేదనిపించినా, అర్షద్ వార్సి పాత్ర ఇంకా బెటర్‌గా ఉండాలి అనిపిస్తుంది. మిగతా నటీనటులకు ప్రధాన్యత దక్కలేదని చెప్పాలి.
కథలోకి తీసుకెళ్లేందుకు దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. ఇది ప్రేక్షకులకు బోర్ కొట్టించింది. ఇక సీిరియస్‌గా సాగుతున్న సెకండాఫ్‌లోనూ చాలా చోట్ల ట్రాక్ తప్పినట్లు అనిపిస్తుంది. కొన్ని కామెడీ సీన్స్ అనవసరంగా పెట్టారని.. ఒక ఎమోషనల్ సాంగ్‌ను వేస్ట్ చేశారని అనిపిస్తుంది. క్లైమాక్స్‌ను కూడా మరింత మెరుగ్గా రాసుకుని ఉండాల్సింది.
సాంకేతిక వర్గం :
దర్శకుడు సుభాష్ కపూర్ ఎంచుకున్న కథ చాలా రొటీన్‌గా అనిపించింది. దేశంలో చాలా రైతు సమస్యలు ఉన్నాయి. అందులో ఈ కథ చాలా పాతది గా అనిపిస్తుంది. ఇక స్క్రీన్ ప్లే విషయంలోనూ ఆయన చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. కథను వివరించే క్రమంలో చాలా ల్యాగ్ సీన్స్ కనిపిస్తాయి. సంగీతం పరంగా సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోవు. అయితే, బీజీఎం మాత్రం బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే, ‘జాలీ ఎల్ఎల్‌బి 3’ చిత్రం గతంలో వచ్చిన రెండు చిత్రాలు క్రియేట్ చేసిన ఇంపాక్ట్‌ను అందుకోవడంలో తడబడింది. అక్షయ్ కుమార్, అర్షద్ వార్సి, సౌరబ్ శుక్లా ఈ సినిమాలో తమ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటారు. కోర్టు సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. అయితే, వీక్ రైటింగ్, కథలో ఆకట్టుకునే అంశం లేకపోవడం, సాగదీత సీన్స్ ఈ చిత్రానికి మైనస్. కోర్టు డ్రామాలను ఇష్టపడేవారు, జాలీ ఎల్ఎల్‌బి ఫ్రాంచైజీలను ఫాలో అయ్యేవారు ఈ సినిమాను తక్కువ అంచనాలతో చూడడం బెటర్.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team