రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి వీరాభిమానులు అంతా కలిపితే ఒక వ్యక్తి అయితే ఎలా ఉంటుందో అలాంటి పర్సనాలిటీనే బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ ని తనకి దైవ సమానంగా పిలుచుకునే బండ్ల గణేష్ లో తమని తాము చూసుకుంటారు ఇతర పవన్ అభిమానులు. అయితే ఈ మధ్య కాలంలో పవన్ సినిమా ఈవెంట్స్ కి బాగా మిస్ అవుతున్నారు.
ఇక ఓజి ఈవెంట్ కి కూడా రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. మరి ఆ ఈవెంట్ కి రావడం ఏమో కానీ ఓజి విషయంలో బండ్ల గణేష్ స్టేట్మెంట్ చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ కి ఉన్న కోట్ల మంది అభిమానుల్లో తాను కూడా ఒకడిని అని ఓజి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను, అవుతుంది కూడా అని తెలిపారు. దీనితో ఓజి విషయంలో తన స్టేట్మెంట్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. ఇక పనిలో పనిగా ఓజి ఈవెంట్ కి కూడా వస్తే తన స్పీచ్ తో ఫ్యాన్స్ కి మరింత ఎగ్జైట్మెంట్ ని తాను ఇస్తారు.