హీరో నితిన్, నిర్మాత దిల్ రాజు కాంబినేషన్లో వచ్చిన తమ్ముడు సినిమాకు రిలీజ్ సమయంలో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో లయ ముఖ్య పాత్రలో నటించగా, సప్తమి గౌడ, స్వాసిక, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్దేవ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
ఓటిటీలో కూడా ఈ చిత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై రెండో ఇన్నింగ్స్ ప్రారంభిస్తోంది. శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న స్టార్ మా, తమ్ముడు చిత్రాన్ని సెప్టెంబర్ 21, 2025 సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది.
టీవీ ప్రేక్షకులు ఈసారైనా సినిమాను ఆదరిస్తారేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించారు.