బాక్సాఫీస్ వద్ద ‘మిరాయ్’ కలెక్షన్ల సునామీ

బాక్సాఫీస్ వద్ద ‘మిరాయ్’ కలెక్షన్ల సునామీ

Published on Sep 15, 2025 2:00 PM IST

mirai-machu

తేజ సజ్జా హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా.81.20 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. సూపర్ యోధుడి పాత్రలో తేజ సజ్జా పర్ఫార్మెన్స్, విజువల్ గ్రాండియర్ ఈ చిత్రానికి బలంగా నిలిచాయి. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

ఇక మంచు మనోజ్ కీ రోల్ చేయగా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు. తొలి రోజు రూ.27.2 కోట్లు రాగా, రెండో రోజు రూ.28.4కోట్లు, మూడో రోజు 25.6 కోట్లు వచ్చాయి. ఈ సినిమాలో విలన్‌గా మంచు మనోజ్ పాత్రకు సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు గౌర హరి సంగీతం అందించాడు. మరి ఈ చిత్రం ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ఇంకా ఎలాంటి వండర్స్ చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాకు ఓవర్సీస్‌లోనూ సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది.

తాజా వార్తలు