‘మిరాయ్’తో ఘనవిజయం అందుకున్న కార్తీక్ ఘట్టమనేని, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కూడా కలిసి పని చేయబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చే సినిమాలో సినిమాటోగ్రాఫర్‌గా తాను పనిచేయనున్నట్లు కార్తీక్ ఘట్టమనేని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారి ‘మిరాయ్’తో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు కార్తీక్ ఘట్టమనేని. 2013లో ‘ప్రేమ ఇష్క్ కాదల్’తో సినిమాటోగ్రాఫర్‌గా మారిన కార్తీక్ ఆ తర్వాత కార్తికేయ, ఎక్స్‌ప్రెస్ రాజా, ప్రేమమ్, రాధ, నిన్నుకోరి వంటి చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేశారు.
మధ్యలో దర్శకుడిగా చేస్తూనే.. సినిమాటోగ్రాఫర్‌గా కూడా కార్తీక్ సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మెగాస్టార్ సినిమాకి కూడా వర్క్ చేయబోతున్నాడు. అన్నట్టు గతంలో చిరు, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడ ప్రత్యేకంగా ఉంటుందట. చిరును కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాసుకున్నారట బాబీ.