‘వైబ్‌’ సాంగ్‌ అందుకే తీసేశారట !

‘వైబ్‌’ సాంగ్‌ అందుకే తీసేశారట !

Published on Sep 14, 2025 1:32 PM IST

Mirai Movie

‘మిరాయ్‌’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతుంది. రెండు రోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.55.6కోట్లు సాధించింది. ఈ సందర్భంగా దర్శకుడు కార్తిక్‌ ఘట్టమనేని ఓ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారు అంటే.. ‘ఈ సినిమాను చిన్నారులకు దగ్గర చేయాలనే ఉద్దేశంతో నిడివి విషయంలో జాగ్రత్త తీసుకున్నాం. నా నిర్ణయమైతే.. 4 గంటల నిడివి ఉంచేవాడినేమో. ఈ విషయంలో ఎడిటర్‌ శ్రీకర్‌ ప్రసాద్‌ ఎప్పటికప్పుడు సింపుల్‌గా వెళ్దామని చెప్పేవారు’ అని తెలిపారు.

కార్తిక్ ఘట్టమనేని ఇంకా మాట్లాడుతూ.. ‘నిజానికి కథకు అడ్డం వస్తున్నాయని రెండు పాటలు తీసేశాం. ఇందులో భాగంగానే ‘వైబ్‌’ సాంగ్‌ కూడా. సినిమాలో ఆ సాంగ్ కుదిరితే పెడదాం. లేకపోతే వద్దనుకున్నాం. ఐతే, ఆ పాట విడుదల చేసినప్పుడు ‘ప్రమోషనల్‌ సాంగ్‌’ అని చెప్పి ఉంటే బాగుండేది’ అని ఆయన తెలిపారు. ఇక ‘అశోకుడి తొమ్మిది గంథ్రాలు ఉన్నాయన్న కథ ప్రచారంలో ఉంది. హిట్లర్‌ సహా పలువురు వాటి కోసం ప్రయత్నం చేశారట. అలా ప్రచారంలో ఉన్న కథలకు ఫాంటసీ జోడించి కథను సిద్ధం చేసుకున్నాం’ అని కార్తిక్ చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు