తెలుగు స్టేట్స్ లో ‘ఓజి’ బుకింగ్స్ ఆరోజు నుంచే ఓపెన్!?

తెలుగు స్టేట్స్ లో ‘ఓజి’ బుకింగ్స్ ఆరోజు నుంచే ఓపెన్!?

Published on Sep 13, 2025 11:02 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రమే “ఓజి”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి మళ్ళీ అజ్ఞాతవాసి సినిమా తర్వాత అంతకు మించిన హైప్ తో ఈ సినిమా రాబోతుంది. దీనితో ఈ సినిమా ఓపెనింగ్స్ ఖచ్చితంగా ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేస్తాయని చాలా మంది నమ్ముతున్నారు. పాన్ ఇండియా లెవెల్లో ఏమో కానీ యూఎస్ ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఓజి కొత్త రికార్డ్స్ సెట్ చేయడం ఖాయం అని అంతా భావిస్తున్నారు.

మరి ఆల్రెడీ యూఎస్ మార్కెట్ లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇక తెలుగు స్టేట్స్ లో బుకింగ్స్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఓజి సినిమా బుకింగ్స్ ఈ సెప్టెంబర్ 19 నుంచే తెరుచుకోనున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించగా థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు