‘ఓజి’ కోసం డబ్బింగ్ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్

‘ఓజి’ కోసం డబ్బింగ్ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్

Published on Sep 12, 2025 11:01 PM IST

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ఓజి ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి గ్యాంగ్‌స్టర్ యాక్షన్ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది.

కాగా, ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్‌లో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో తన పాత్ర కోసం డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేశాడు. హైదరాబాద్‌లోని ఓ డబ్బింగ్ స్టూడియోలో పవన్ డబ్బింగ్ చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన చెప్పే డైలాగులు ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తాయని చిత్ర వర్గాల టాక్.

ఇక ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో నటిస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు