‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్ ఎప్పుడు షురూ చేస్తారు..?

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్ ఎప్పుడు షురూ చేస్తారు..?

Published on Sep 12, 2025 3:00 AM IST

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ఒకటి. దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

అయితే, ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మరో రెండు రోజుల్లో ముగిస్తారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దీంతో వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మేకర్స్ బిజీగా ఉంటారు. మరి ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఎప్పుడు వస్తాయా.. ఈ చిత్ర ప్రమోషన్స్‌ను ఎప్పుడు మొదలుపెడతారా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ సినిమాలో అందాల భామలు శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు