ట్రాన్స్ ఆఫ్ ఓమి.. విధ్వంసానికి మారుపేరు..!

ట్రాన్స్ ఆఫ్ ఓమి.. విధ్వంసానికి మారుపేరు..!

Published on Sep 11, 2025 7:01 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఓజి’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఓ సర్‌ప్రైజ్ ట్రీట్ అందించారు.

ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ వీడియో ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకుందో మనం చూశాం. ఈ సినిమాలో ఓమి అనే పాత్రలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి నటిస్తున్నాడు. ఇక ఆయన లుక్స్, యాక్షన్ ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని ఓజి గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. అయితే, ఓమి పాత్ర ఎలా ఉండబోతుందో వివరించే ఓ చిన్న థీమ్ సాంగ్‌ను తాజాగా రిలీజ్ చేశారు.

ట్రాన్స్ ఆఫ్ ఓమి అంటూ వచ్చిన ఈ పాటలో ఓమి ఎలాంటి వ్యక్తి అనే విషయాన్ని రివీల్ చేశారు. విధ్వంసానికి మరో పేరు ఓమి అంటూ ఈ సాంగ్‌లో ఇమ్రాన్ పాత్రను ఎలివేట్ చేసిన విధానం సూపర్బ్‌గా ఉంది. ఇక దీనికి థమన్ అందించిన ట్యూన్ క్యాచీగా ఉండటంతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తుంది. ఈ సర్‌ప్రైజ్ ట్రీట్ కూడా సాలిడ్‌గా ఉండటంతో ఓజి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సెప్టెంబర్ 25న ఓజి చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

తాజా వార్తలు