‘ఓజి’ నుంచి ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ కి టైం ఫిక్స్ చేసిన థమన్!

‘ఓజి’ నుంచి ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ కి టైం ఫిక్స్ చేసిన థమన్!

Published on Sep 11, 2025 1:09 PM IST

Og Movie

ప్రస్తుతం ఊహించని లెవెల్ హైప్ లో ఉన్న భారీ చిత్రమే “ఓజి”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించారు. అయితే ఈ సినిమా నుంచి ఇమ్రాన్ పై సంగీత దర్శకుడు రీసెంట్ గా ఇచ్చిన గ్లింప్స్ స్కోర్ విని అంతా షాకయ్యారు.

థమన్ నుంచి ఈ రేంజ్ డ్యూటీ ఊహించకపోవడంతో ఓజి పై మరిన్ని అంచనాలు సెట్ అయ్యాయి. ముఖ్యంగా ఈ బీట్స్ కి సాలిడ్ రెస్పాన్స్ రాగా ఈ ట్రాక్ ఒకటే 4 నిముషాలు ఉందని థమన్ కన్ఫర్మ్ చేసాడు. ఇక ఈ ట్రాన్స్ లోకి తీసుకెళ్లే ట్యూన్ ని ఈరోజు సాయంత్రం ట్రాన్స్ ఆఫ్ ఓమి గా 6 గంటల 3 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా తాను కన్ఫర్మ్ చేసాడు. సో దీనితో ఈ ట్రాక్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు