సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !

సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !

Published on Sep 12, 2025 3:05 PM IST

kishkindhapuri

విడుదల తేదీ : సెప్టెంబర్ 12, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : బెల్లకొండ సాయి శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్‌, తనికెళ్ల భరణి, హైపర్‌ ఆది, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, శాండీ మాస్టర్‌, మర్కంద్‌ దేశ్‌పాండే, హినా భాటియా తదితరులు;
దర్శకుడు : కౌశిక్‌ పెగళ్లపాటి;
నిర్మాత : సాహు గారపాటి;
సంగీత దర్శకుడు : చైతన భరద్వాజ్‌;
సినిమాటోగ్రాఫర్ : చిన్మయ్‌ సలాస్కర్‌;
ఎడిటర్ : నిరంజన్‌ దేవరమనే;

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా న‌టించిన తొలి హార‌ర్ చిత్ర‌ం ‘కిష్కింధ‌పురి’. అనుప‌మ క‌థానాయిక‌. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

రాఘ‌వ్ (బెల్లంకొండ సాయిశ్రీనివాస్), మైథిలి (అనుప‌మ‌) ఇద్దరు ప్రేమలో ఉంటారు. పైగా ఇద్దరు కలిసి ఘోస్ట్ వాకింగ్ పేరుతో హాంటెడ్ హౌసెస్ టూర్స్‌ చేస్తుంటారు. థ్రిల్ కోరుకునే వాళ్లంద‌రినీ క‌లిపి ఓ పాడుబ‌డిన బంగ్లాల్లోకి తీసుకెళ్లి అక్క‌డ దెయ్యాలు ఉన్నాయ‌ని న‌మ్మిస్తూ థ్రిల్ పంచ‌డ‌మే ఆ టూర్ ఉద్దేశం. అలా ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల ఆధారంగా కిష్కింధ‌పురి అనే ఊరి ప‌రిస‌రాల్లో ఉన్న సువ‌ర్ణ‌మాయ అనే రేడియో స్టేష‌న్‌కి వెళ్తారు. 1989లోనే పాడుబ‌డిన స్టేష‌న్ అది. అందులో దెయ్యం ఉంటుంది. ఇంతకీ, ఆ దెయ్యం ఎవరు ?, ఎందుకు అందర్నీ చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది ?, రాఘ‌వ్ త‌న ప్రాణాల్ని అడ్డుపెట్టి దెయ్యానికి ఎందుకు ఎదురెళ్లాడు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

అసూయ, ద్వేషంతో చనిపోయిన వ్యక్తి ఆత్మ పగతో రగిలిపోతూ.. మనుషుల ప్రాణాలు తీయడానికి ఎదురుచూస్తూ ఉంటే ఎలా ఉంటుంది ? అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ యాక్షన్ హారర్ రివేంజ్ డ్రామాలో కొన్ని ఎమోషన్స్ అండ్ మెయిన్ కథాంశం బాగున్నాయి. అలాగే ఈ ‘‘కిష్కింధ‌పురి’’ సినిమాలో కోర్ పాయింట్ కూడా బాగుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన రాఘవ పాత్ర .. ఆ పాత్రకి సంబంధించిన ఘోస్ట్ వాకింగ్ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన అనుపమ పాత్ర.. ఇలా మొత్తానికి ‘కిష్కింధపురి’ సినిమా ఆకట్టుకుంది.

ఈ సినిమాలో హీరోగా నటించిన బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ తన పాత్రకు తగ్గట్లు బాగా నటించాడు. తన యాక్షన్ అండ్ వాయిస్ తో అద్భుతంగా మెప్పించాడు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. అలాగే, మరో కీలక పాత్రలో నటించిన తనికెళ్ల భరణి కూడా బాగా నటించారు. శ్రీకాంత్‌ అయ్యంగార్‌ నటన బాగుంది. ఇక హైపర్‌ ఆది, శాండీ మాస్టర్‌, మర్కంద్‌ దేశ్‌పాండే, హినా భాటియాలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

ముఖ్యంగా సీనియ‌ర్ క‌థానాయిక ప్రేమ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. డీ గ్లామ‌ర్‌గా క‌నిపిస్తూ ఆమె త‌ల్లి పాత్ర‌కి ప్రాణం పోశారు. ద‌ర్శ‌కుడు కౌశిక్ ఓ కొత్త నేప‌థ్యంలోనే క‌థ‌ని రాసుకున్న విధానం ఆకట్టుకుంది. మెయిన్ గా హారర్ సన్నివేశాలను డీల్ చేసిన విధానం చాలా బాగుంది. అలాగే, ప‌తాక స‌న్నివేశాల్లోని మ‌లుపులు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

దెయ్యాలు, ఆత్మల కథలు తెలుగు సినిమాకి కొత్తేమీ కాదు. కానీ, ఈ సినిమాలో కొన్ని చోట్ల కొత్త ఎలిమెంట్స్ ను పెట్టడం బాగుంది. దీనికి తోడు, ‘కిష్కింధపురి’లోని హారర్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. అయితే, కథనంలో కొన్ని చోట్ల కీలక సన్నివేశాలు స్లోగా సాగడం, అలాగే.. సినిమా మొదట్లో కాన్ ఫ్లిక్ట్ ఆకట్టుకునే విధంగా లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.

అయితే, దర్శకుడు ఫస్ట్ హాఫ్ పై ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ… అదే విధంగా అతను రాసుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. సినిమాలో కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయింది. మొత్తానికి కథనం విషయంలో దర్శకుడు ఇంకా బాగా కసరత్తులు చేసి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.

సాంకేతిక విభాగం :

సినిమాలో చెప్పాలనుకున్న హారర్ ఎలిమెంట్స్ అండ్ ఎమోషనల్ కంటెంట్ కూడా బాగుంది. కథనం ఇంకా ఆసక్తికరమైన ప్లోతో ఉంటే సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. మొత్తానికి కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకుడిగా ఆకట్టుకున్నాడు. ఇక సంగీత దర్శకుడు చైతన భరద్వాజ్‌ సమకూర్చిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ చిన్మయ్‌ సలాస్కర్‌ సీన్స్ ను తెరకెక్కించిన విధానం బాగుంది. నిరంజన్‌ దేవరమనే ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఈ చిత్ర నిర్మాత సాహు గారపాటి పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

‘కిష్కింధపురి’ అంటూ వచ్చిన ఈ హారర అండ్ ఎమోషనల్ రివేంజ్ డ్రామాలో.. హారర్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు పాత్రల తీరు, అలాగే వాటి ఎమోషన్స్ కూడా బాగున్నాయి. బెల్లకొండ సాయి శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్‌ ల నటన కూడా సినిమా స్థాయిని పెంచింది. ఐతే, కొన్ని చోట్ల ప్లే స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లో ఇంట్రెస్ట్ మిస్ అయింది. ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం ఆకట్టుకుంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

తాజా వార్తలు